దేశంలో కరోనా కేసులు (Corona cases) వరుసగా రెండో రోజూ పెరిగాయి. బుధవారం 8954 కేసులు నమోదవగా తాజాగా అవి 9 వేలు దాటాయి. దీంతో నిన్నటికంటే ఇవి 8 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 9765 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,06,541కి చేరింది. ఇందులో 3,40,37,054 మంది కోలుకోగా, 4,69,724 మంది మృతిచెందారు.
మరో 99,763 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 8,548 మంది కరోనా నుంచి బయటపడగా, 477 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 1,24,96,19,515 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, ఇందులో బుధవారం ఒకేరోజు 80,35,261 మంది టీకా ఇచ్చామని తెలిపింది.