సౌతాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ కరోనా వేరియంట్ భారత్ లో థర్డ్ వేవ్ కు ప్రధాన కారణం కావచ్చని IIT కాన్పూర్ ప్రొఫెసర్ పద్మశ్రీ మనీంద్ర అగర్వాల్ తెలిపారు. అయితే ఈ వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేమన్నారు.
వ్యాక్సిన్ కంటే సహజ రోగ నిరోధక శక్తి ఈ వేరియంట్ను ఓడించగలదని ఆయన అన్నారు. దేశంలోని 80% జనాభాలో సహజ రోగ నిరోధక శక్తి బలోపేతం అయిందని చెప్పారు.