‘కరోనా లేదు బిరోనా లేదు’ అని చాలా మంది మాస్కు పెట్టుకోవడాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు ఒమిక్రాన్ భయపెడుతుండటంతో మాస్కు తప్పనిసరి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మొక్కుబడిగా కాకుండా నోరు, ముక్కు పూర్తిగా కవర్ అయ్యేలా పెట్టుకోవాలంటున్నారు. అలాగే టీకా వేయించుకున్న వారిలో ఒమిక్రాన్ రాదనేది తప్పుడు ప్రచారమని, 2 డోసుల టీకా వేసుకున్నా మాస్క్ తప్పనిసరని చెబుతున్నారు.