ఎవరు ఊహించని ట్విస్ట్‌తో బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చిన యాంకర్ రవి పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్లలో రవికి అత్యధిక పారితోషికం చెల్లిస్తున్నారట! వారానికి రూ. 7 లక్షల నుంచి 8 లక్షల మధ్యలో ఇస్తున్నారట. మరో రెండు వారాలు ఉంటే చాలా మొత్తం చెల్లించాల్సి ఉంటుందని భావించిన బిగ్ బాస్ యాజమాన్యం ఊహించని ఎలిమినేషన్‌తో బయటకు పంపించినట్టు టాక్స్ నడుస్తున్నాయి.
రవి బిగ్ బాస్ హౌజ్‌లో 12 వారాలు ఉన్నాడు కాబట్టి అతను 90 లక్షల రూపాయలు వెనకేసినట్లు తెలుస్తోంది. ఇది బిగ్‌బాస్ విజేతకు అందించే 50 లక్షల ప్రైజ్‌మనీ కన్నా ఎక్కువ కావడం గమనార్హం! షో ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో రవిని ఇంకా హౌజ్‌లో ఉంచి మరింత రెమ్యునరేషన్ ఇచ్చే సాహసం నిర్వాహకులు చేయలేదట. అందుకే అతనిని బయటకు పంపించారని ప్రచరం నడుస్తుంది. ఒక లేడీ కంటెస్టెంట్‌ను ఫినాలేకు పంపించాలని కూడా బలంగా ఫిక్సయినట్లు రవి ఎలిమినేషన్‌తో చెప్పకనే చెప్పారు.