తెలంగాణ రాష్ట్రంలో బీపీ, షుగర్ పేషెంట్లకు డిసెంబర్ నుంచి దశల వారీగా ఉచితంగా మెడిసిన్ కిట్లు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో 20 లక్షల మంది బీపీ రోగులు, 7 లక్షల మంది షుగర్ రోగులు ఉన్నట్లు నేషనల్ హెల్త్ మిషన్ సర్వేలో తేలింది.
వీరికి ప్రభుత్వం ఇచ్చే కిట్లో నెలకు సరిపడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకునే బీపీ, షుగర్ మందులు ఉంటాయి. గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్ వద్ద వీటిని ఇస్తారు.