ఏపీలోని గుంటూరు జిల్లా మంగళగిరి అధికార YSRCP MLA ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) నిన్న అస్వస్థతకు గురయ్యారు. ఛాతినొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆయన్ని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆర్కే పాల్గొన్నారు.