తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఉన్న ఓయూలోకి ఇక నుంచి వెళ్లాలంటే డబ్బులు కట్టాల్సిందే. స్టాఫ్, స్టూడెంట్లు మినహా మిగతా ఎవరు వచ్చినా పాస్ తీసుకోవాల్సిందేనని యూనివర్సిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు.
వాకర్స్ నుంచి నెలకు రూ.200, గ్రౌండ్ వాడుకునేందుకు రూ.500, జిమ్ వాడేందుకు రూ. 1,000 యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. డిసెంబర్ 1 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి.