హిట్ చిత్రాల దర్శకుడు బోయపాటి శీను తెరకెక్కిస్తున్న ‘అఖండ’ ప్రీరిలీజ్ ఈవెంట్లో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ,స్టైల్ స్టార్ అల్లు అర్జున్ లను ఒకే వేదికపై చూసి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. బన్నీ మాట్లాడుతున్నప్పుడు ‘జై బాలయ్య.. జైజై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు.
అందరి ప్రేమ, ఆనందం కోసం అంటూ ఆఖరిలో ‘జై బాలయ్య’ అంటూ స్పీచ్ ముగించాడు ఐకాన్ స్టార్. ‘కొవిడ్ వచ్చినా, పైనుంచి దిగి దేవుడొచ్చినా.. తెలుగు సినిమా తెలుగు ప్రేక్షకులు తగ్గేదే లే’ అని బన్నీ అనగానే ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తించారు.