ప్రముఖ బహుళజాతి సంస్థ అయిన WIPRO కంపెనీ ఆన్లైన్ ప్రాంగణ నియామకాలు నిర్వహించిందని, దీనిలో స్థానిక SBIT ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 21 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని కళాశాల చైర్మన్ శ్రీ జి. కృష్ణ తెలియచేసారు.
ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రాంగణ నియామకాలు నిర్వహించారని, ఎంపికైన 21 మందిలో CSE విభాగం నుండి 13 మంది. ECE నుండి 7గురు, Mechanical నుండి ఒక్కరు ఉద్యోగాలు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డా॥ జి. రాజ్‌కుమార్ తెలిపారు.
ఆన్లైన్ టెస్ట్, టెక్నికల్ రౌండ్, హెచ్.ఆర్ పద్ధత్తులలో ఇంటర్వూ నిర్వహించారని, ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు వార్షిక వేతనం 3.5 లక్షలుగా ఉంటుందని కళాశా టి.పి.ఓ. యన్. సవిత తెలిపారు.ఉద్యోగాలు పొందిన విద్యార్థులను కళాశాల సెక్రటరి అండ్ కరస్పాండెంట్ డా॥ జి. ధాత్రి, ఎకడమిక్ డైరెక్టర్స్ డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, డా॥ సి. శ్రీనివాసశర్మ, జి. ప్రవీణ్ కుమార్ మరియు వివిధ విభాగాల హెచ్.ఓ.డిలు అభినందించారు.