తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్, నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జీతభత్యాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై టీఎస్ ఆర్టీసీ ఎండీకి లేఖ ఇచ్చారు.
తనకు శాసనసభ్యుడిగా వస్తున్న జీతభత్యాలు చాలని పేర్కొన్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థపై భారం మోపడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.