ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వరదల్లో చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షలతో పాటు.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు.
వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు, పునరుద్ధరణ పనులు 100 శాతం పూర్తి చేశామని వెల్లడించారు. ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు పంట నష్టం నివేదికలను పూర్తి చేసి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.