తెలంగాణలో ఎమ్మెల్సీల అంశం మొత్తానికి కొలిక్కి వచ్చింది. ఇక, పలువురు సీనియర్ నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్.. శాసనమండలి చైర్మన్ పదవి కోసం ఎవరిని ఎంపిక చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఈ పదవి సీనియర్లయిన గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుసూదనాచారి, కడియం శ్రీహరిలో ఒకరికి దక్కవచ్చని తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక కూడా పూర్తయిన తరువాత మండలి చైర్మన్ ఎన్నిక ఉండనుంది.