Tollywood కి చెందిన’మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించాడు అధ్యక్షుడు మంచు విష్ణు. తాజాగా AIG, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ ఆస్పత్రులతో ‘మా’ ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషన్తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు విష్ణు తెలిపాడు. అసోసియేషన్లో ఉన్న సభ్యులందరికీ దశల వారీగా ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని తెలిపాడు.