బ్రేక్ ఫాస్ట్ సమయంలో శనగలు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఓ కప్పు శనగలు తింటే.. రక్తహీనత సమస్య తొలగుతుంది.
బ్లడ్ ప్రెజర్ను అదుపుచేసే శక్తి శనగలకు ఎక్కువగా ఉంటుంది. శనగలలోని ఫైబర్ డైజెస్టివ్ సిస్టంకు చాలా మేలు చేస్తుంది. మలబద్దకం, అజీర్తి సమస్యల నుండి బయటపడేస్తుంది. శనగలతో శరీరానికి ప్రొటీన్లు అందుతాయి. హెమోగ్లోబిన్ ఇంప్రూవ్ అవుతుంది.