దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 7,579 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 513 రోజుల కనిష్ఠానికి పడిపోయింది.
ఇక నిన్న కరోనాతో 236 మంది మరణించారు. ఒక్క కేరళలోనే గత 24 గంటల్లో 3,698 కేసులు, 75 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 1,13,584 యాక్టివ్ కేసులు ఉన్నాయి.