తెలంగాణ రాష్ట్రంలో 18వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 1.20 లక్షల టీచర్ పోస్టులకు గాను ప్రస్తుతం 1.02 లక్షల మంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ పోస్టులను కొత్త జిల్లాలవారీగా విభజించి, కేటాయిస్తామన్నారు. ఇవి కాకుండా మరో 1,500 బోధనేతర, డైట్, బీఈడీ కాలేజీలు, విద్యాశాఖ కార్యాలయాల్లో పోస్టులను సైతం కొత్త జిల్లాల వారీగా విభజించేందుకు కసరత్తు చేస్తున్నారు.