Cinima దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కించిన ప్రస్టీజియస్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7న విడుదల కానుండగా, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు జక్కన్న.
అయితే ఈ సినిమా విడుదల తేది ప్రకటించగానే మహేష్ బాబు సర్కారు వారి పాట వాయిదా పడింది. జనవరి 13న విడుదల కావల్సిన చిత్రం ఏప్రిల్ 1కి షిఫ్ట్ అయింది.పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రాలు మాత్రం చెప్పిన టైంకే విడుదల కాబోతున్నాయని తెలుస్తుంది.
జనవరి 12న భీమ్లా నాయక్ విడుదల కానుండగా, 14న రాధే శ్యామ్ రిలీజ్ కాబోతుంది. అయితే ఒకే సారి పెద్ద సినిమాలు రిలీజ్ అయితే థియేటర్స్‌తో పాటు బిజినెస్ సమస్య కూడా వస్తుందని భావించిన రాజమౌళి.. పవన్‌ని కలిసి భీమ్లా నాయక్ సినిమాను వాయిదా వేయమని కోరతాడని వార్తలు వస్తున్నాయి. మరి రాజమౌళి కోరికని పవన్ వింటాడా అనేది ఆసక్తికరంగా మారింది.