తెలంగాణ గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. బీజేపీ రైతులు, దళితుల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. హనుమకొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
తనకు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినందుకుగాను సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో ధర్నా చేస్తామని కేసీఆర్ హెచ్చరించడంతోనే కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కి తీసుకుందని చెప్పారు.
భారతదేశానికి ఎక్కువ ఆదాయం ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఉద్యమం సత్ఫలితాలు ఇచ్చిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ అమ్మేస్తున్నదని విమర్శించారు. తెలంగాణకు కేంద్రం చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.