దేశంలో కొత్తగా 10,488 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,10,413కు చేరింది. ఇందులో 3,39,22,037 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,65,662 మంది మరణించారు.
ఇంకా 1,22,714 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 12,329 మంది కరోనా నుంచి బయటపడగా, 313 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,16,50,55,210 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.
దేశంలో యాక్టివ్ కేసులు 532 రోజుల కనిష్టానికి చేరాయని వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.36 శాతం ఉన్నాయని, 2020 మార్చి తర్వాత ఇదే అతితక్కువ అని పేర్కొన్నది. ఇక రోజువారీ పాజిటివిటీరేటు 0.98 శాతం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.