తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
గత నెల 30న ఆయన ఇంట్లో కాలుజారి కిందపడటంతో గాయాలై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసందే. చికిత్స తర్వాత కాస్త ఆరోగ్యం మెరుగుపడిందని వార్తలు వచ్చాయి.
ఇంతలోనే మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు కైకాలను అపోలోకు తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త విషంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.