కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సాగు చట్టాల రద్దుపై కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం సిగ్గుచేటంది. నిద్రావస్థలోని దేశానికి నియంతృత్వమే సరైనదని ట్వీట్ చేసింది.
‘కేంద్రం తీసుకున్న నిర్ణయం అన్యాయం, సిగ్గుచేటు. ప్రభుత్వం.. పార్లమెంటులో చేయాల్సిన చట్టాలను.. రోడ్లెక్కిన కొందరు నిర్దేశిస్తుంటే.. ఇది కూడా మరో జిహాదీ దేశమే అవుతుంది. ఇలాగే జరగాలని ఆశించిన వాళ్లందరికీ నా శుభాకాంక్షలు’ అని పేర్కొంది.