Most Talented హీరోయిన్ నివేతా థామస్ సినిమాల పరంగా తన కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గానే మంచి పేరు తెచ్చుకున్న నివేతా..ఆ తర్వాత హీరోయిన్‌గానూ కొంతకాలం మంచి దూకుడు చూపించింది. నేచురల్ పర్ఫార్మెన్స్తో సౌత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న తనకు తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
యంగ్ హీరోలకి పర్ఫెక్ట్ ఛాయిస్ అని అందరూ చెప్పుకున్నారు. అంతేకాదు వరుస సినిమాలతో టాప్ ప్లేస్‌లో ఉంటుందని భావించారు. ప్రారంభంలో నివేతా కెరీర్ అలాగే సాగింది కూడా. ‘జెంటిల్ మేన్’, ‘నిన్ను కోరి’, ‘జై లవ కుశ’ లాంటి సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. ‘118’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి డిఫరెంట్ సినిమాలలోనూ నివేతా తన సత్తా చాటింది.
అయితే, గ్లామర్ పాత్రలకు ‘ఎస్’ చెప్పకపోవడమే తన కెరీర్ బాగా నెమ్మదిగా సాగడానికి కారణం అని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ‘వి’ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’లో నటించింది. అయితే, ఇందులో ముగ్గురు అమ్మాయిల్లో ఒకరుగా నటించడం అంతగా నివేతాకి కలిసి రాలేదంటున్నారు. దానికి ముందు చేసిన ‘వి’ మూవీ కూడా తనకు అంతగా పేరు తెచ్చింది లేదు. ప్రస్తుతం ‘శాకిని – ఢాకిని’ సినిమా ఒక్కటే తన చేతిలో ఉంది. మరి ఇప్పటి నుంచైనా కాస్త గ్లామర్ రోల్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మళ్ళీ ఫాంలోకి వస్తుందేమో చూడాలి.