Home / EDITORIAL / ఢిల్లీ పాలకులకు బుద్ధి చెప్పాలి..

ఢిల్లీ పాలకులకు బుద్ధి చెప్పాలి..

ఒక తండ్రి తన పిల్లలందరిని సమాన దృష్టితో చూస్తాడు. కానీ ఇప్పుడు దేశంలో ఈ పరిస్థితి కనిపించడం లేదు. రాష్ర్టాల విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నది. తండ్రి పాత్ర పోషించాల్సిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ర్టాల మధ్య వివక్ష చూపుతున్నది. తెలంగాణ రైతు పండించిన వడ్లు కొనడానికి నిరాకరిస్తున్నది. పైగా రాష్ట్రంలోని బీజేపీ నాయకులు వరి వేసుకోవాలంటూ రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన విధానం.

తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ నాయకత్వంలోని వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్‌ ల నిర్మాణం జరిగింది. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ జరిగి నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. రైతు బంధు పేర పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. రైతుబీమాతో రైతుల కుటుంబాలకు భరోసా ఏర్పడింది. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్‌ను తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన విప్లవాత్మక విధానాలు తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేసాయి.

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగలా మారిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం ద్వంద్వ విధానాలను అవలంబిస్తున్నది. రైతు పండించిన ధాన్యం కొనబోమంటూ బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపుతున్నది. ఇక్కడ రాష్ట్రంలో మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ధాన్యం కొంటాం పంటలు వేయండని పచ్చి అబద్దాలు చెబుతున్నాడు. కేంద్రం వైఖరి ముందే గ్రహించి రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో వరి పంట బదులుగా యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయండని తెలంగాణ ప్రభుత్వం రైతులకు విజ్ఞాపన చేసింది. అయితే ఈ మోసకారి బీజేపీ మాత్రం వరి పంట వేయండని రెచ్చగొడుతున్నది. ఢిల్లీ బీజేపీది ఒకమాట ఇక్కడ గల్లీ బీజేపీది మరోమాట. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు ఏడాదిగా ధర్నాలు చేస్తుంటే వందల మంది రైతుల ప్రాణాలను బలిగొన్న ఘనత బీజేపీది. బీజేపీ పాలిత యూపీలో రైతులు ధర్నా చేస్తుంటే వాళ్ళపైకి కార్లు ఎక్కించి నలుగురు రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ. అది చాలదన్నట్టు అభివృద్ధి బాటలో పయనిస్తున్న తెలంగాణ రైతులను తప్పుదోవ పట్టించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది.

నాడైనా నేడైనా రైతు ప్రయోజనాలే టీఆర్ఎస్‌కు ముఖ్యం. రైతుల పక్షాన పోరాడటం టీఆర్ఎస్‌కు కొత్తకాదు.దేశ ప్రగతిలో తెలంగాణ నాలుగవ స్థానంలో ఉంది. రైతును రాజు చేసిన కేసీఆర్‌ రైతులు ఆగం అవుతుంటే ఎలా ఊరుకుంటారు?

రైతులను మోసం చేస్తున్న బీజేపీ తీరును రైతులు వ్యతిరేకించాలి. కేసీఆర్‌ నాయకత్వంలో పోరాడి మన హక్కులను సాధించుకోవాలి. కేంద్రం మెడలు వంచి మన వడ్లు కొనేలా ఒత్తిడి తేవాలి. రైతులంతా సంఘటితంగా ముందుకు కదలాలి. తెలంగాణ రైతుల శక్తిని ఢిల్లీ పాలకులకు తెలిసేలా చేయాలి.

తెలంగాణ విజయ్‌
94919 98702

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat