టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నా బాలీవుడ్లోనూ మంచి ఆఫర్లు కొట్టేస్తోంది. ఇప్పటికే షాహిద్ ‘సన్నీ’, అజయ్ దేవగణ్ ‘రుద్ర’లో నటించిన ఈ ముద్దుగుమ్మకు కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘యోధ’ అనే యాక్షన్ ఫ్రాంచైజీలో ఓ లీడ్ రోల్ దక్కిందట. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ వంటి నటులు ఇందులో నటిస్తున్నారు. పుష్కర్ ఓజా ఈ ఫ్రాంచైజీతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
Tags Bollywood bumper offer film nagar film news kollywood movie news movies rashikhanna slider Telugu Movies tollywood