దేశంలో గడిచిన 24గంటల్లో 12,32,505 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 11,919 మందికి వైరస్ సోకినట్లు తేలింది. కేసుల్లో మళ్లీ వృద్ధి కనిపించింది. 11,242 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ప్రస్తుతం మొత్తం కేసులు 3.44 కోట్లకు చేరగా 3.38 కోట్ల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.28 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 1,28,762 మంది మహమ్మారితో బాధపడుతున్నారు.