ఏపీలో వెలువడుతున్న మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా గుంటూరు జిల్లా గురజాల మున్సిపాలిటీని అధికార పార్టీ వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 20 వార్డుల్లో 16 చోట్ల వైసీపీ అభ్యర్థులు విజయం సాధించింది..
3 వార్డుల్లో టీడీపీ, ఒక వార్డులో జనసేన అభ్యర్థులు గెలిచారు. అలాగే కడప జిల్లా కమలాపురం మున్సిపాలిటీలో 20 వార్డులకు 15 వార్డుల్లో వైసీపీ 5 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అటు కర్నూలు జిల్లా బేతంచర్ల మున్సిపాలిటీలో 20 వార్డులకు వైసీపీ 14 చోట్ల, టీడీపీ 6 వార్డుల్లో గెలిచింది.