ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత,నారా చంద్రబాబు నాయుడుకు సొంత ఇలాఖాలోనే దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఈ రోజు వెలువడుతున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్‌షాక్ తగిలింది. ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను కోల్పోయిన టీడీపీ.. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే బాటలో పయనిస్తోంది.
ఇప్పటివరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. మొదటి రౌండ్లో 14 వార్డులకుగాను 12 వార్డుల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. హైకోర్టు ఆదేశాలతో కుప్పంలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతోంది. ప్రత్యేక అధికారి ప్రభాకర్ ఆధ్వర్యంలో కౌంటింగ్ ప్రక్రియను అధికారులు కొనసాగిస్తున్నారు.