శీతాకాలంలో ఎక్కువ ప్రోటీన్లు ఉండే బలవర్ధక ఆహారం తీసుకోవాలని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. శరీరానికి ప్రోటీన్ గుడ్లు, నాన్-వెజ్ నుండి మాత్రమే సమృద్ధిగా లభిస్తుందని నమ్ముతారు.
కానీ, శాఖాహారంలో కూడా ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. వేరుశెనగలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. అనేక ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు వేరుశెనగలో ఉంటాయి. అంతేకాదు.. చలికాలంలో కూరగాయలు, చేపలు, నట్స్ తదితర ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.