ఆస్ట్రేలియా జట్టు తొలి సారి టీ20 వరల్డ్‌కప్ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో కివీపై విక్టరీ నమోదు చేసింది. అయిదు సార్లు వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన ఆస్ట్రేలియా మొదటిసారి టీ20ని కైవసం చేసుకున్ననది. ఈ విజయంతో ఆస్ట్రేలియాకు 13.1 కోట్ల ప్రైజ్‌మనీ వశమైంది.
టీ20 వరల్డ్‌కప్ మొత్తం ప్రైజ్‌మనీ 42 కోట్లు కాగా, 16 జట్లకు ఆ అమౌంట్‌ను పంపిణీ చేశారు. చాంపియన్‌గా నిలిచి ఆస్ట్రేలియాకు మొత్తం 13.1 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. దీంట్లో టోర్నీ గెలిచినందుకు 11.9 కోట్లు, 4 లీగ్ మ్యాచ్‌లు గెలిచినందుకు 1.2 కోట్లు దక్కాయి.
రన్నరప్ న్యూజిలాండ్‌కు 7.15 కోట్ల ప్రైజ్‌మనీ వచ్చింది. ఫైనల్లో చేరినందుకు 5.95 కోట్లు, సూపర్-12లో 4 మ్యాచ్‌లు గెలిచినందుకు కివీస్‌కు అదనంగా 1.2 కోట్లు దక్కాయి. సెమీస్‌కు చేరిన ఇంగ్లండ్, పాక్‌కు చెరో 3 కోట్లు దక్కాయి. 5 మ్యాచ్‌లు నెగ్గిన పాకిస్థాన్‌కు అదనంగా 1.5 కోట్లు చేరాయి. ఇండియా, నమీబియా, స్కాట్‌లాండ్‌కు చెరో 1.42 కోట్ల ప్రైజ్‌మనీ వశమైంది.