‘భీమ్లా నాయక్’ సంక్రాంతి బరినుంచి తప్పుకోనట్టే అని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీకి యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకుడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుందని సమాచారం. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
అయితే.. రాం చరణ్, ఎన్.టి.ఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ 2022, జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సంక్రాంతి బరినుంచి తప్పుకొని ఏప్రిల్ 1న రాబోతోంది. ఇదే క్రమంలో పవన్, రానాల ‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్ మార్చుకుంటుందని ప్రచారం జరుగుతోంది.
అయితే, ఇందుకు పవన్ కళ్యాణ్ గానీ, నిర్మాత గానీ సిద్దంగా లేరని సమాచారం. ఎట్టిపరిస్థితుల్లో ప్రకటించిన తేదీకే ‘భీమ్లా నాయక్’ వచ్చేస్తుందని తెలుస్తోంది. దీనిపై పూర్తి స్థాయిలో క్లారిటీ త్వరలో రానుందంటున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లేతో పాటు డైలాగ్స్ అందిస్తున్నారు.