అందాల తార ఐశ్వర్య రాయ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ తెలిసిందే. ఆమె గురించి ప్రతి విషయం గురించి తెలుసుకోవాలని ఎగ్జాయిట్‌మెంట్‌తో ఎదురు చూస్తుంటారు. తాజాగా ఈ బ్యూటీ మరోసారి గర్భవతైందనే రూమర్ నెట్టింట హల్చల్ చేస్తోంది.
తాజాగా ముంబై విమానాశ్రయంలో ఐశ్వర్యరాయ్, భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్యతో కలిసి మీడియా కంటపడింది. టెర్మినల్ ప్రవేశద్వారం వద్ద ఉన్న సీఐఎస్ఎఫ్ పర్సన్‌కు తమ ప్రయాణ పత్రాలను చూపించడానికి అభిషేక్ ఆగిపోయాడు. ఆ సమయంలో రిపోర్టర్స్ వారి ఫోటోలను తీయడానికి ప్రయత్నించారు. అప్పుడు కూతురిని దగ్గరకి లాక్కుంది. చేతిలోని హ్యాండ్‌బ్యాగ్‌ని పొత్తి కడుపుకి అడ్డుగా పెట్టుకుంది.
దీంతో ఈ అందాల తార గర్భవతని, ఆ విషయాన్ని దాచడానికి ఆమె అలా విచిత్రంగా ప్రవర్తించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆరాధ్య పదో పుట్టిన రోజు జరుపుకోవడంతో ఈ బ్యూటీ నిజంగా ప్రెగ్నెంట్ కావొచ్చని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.