అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సరైన హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అఖిల్ కు ఈ చిత్రం ఏకంగా బ్లాక్ బాస్టర్ నే ఇచ్చింది.
అల్లు అరవింద్ సమర్సణలో ‘ గీతాఆర్ట్స్-2 ‘ బ్యానర్ పై బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే మిక్స్‌డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్లపరంగా మాత్రం భారీగానే వసూలు చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రీలిజ్ తేదీని చిత్ర బృందం ప్రకటించింది.
గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో సినిమా అంటే ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉంటాయి. దానికి తోడుగా ఈ చిత్రంలోని పాటలు యువతకు తెగనచ్చేశాయి. యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకున్నాయి. కాగా ఈ చిత్రం విడుదలైన 35 రోజుల్లోపే ఓటీటీలో విడుదల కాబోతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రాన్ని ఈ నెల 19న ఆహా లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రూ.20.91 కోట్ల బిజినెస్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసే సరికి రూ.23.75 కోట్ల షేర్ ను సాధించింది. ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లకు రూ.2.75కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. అఖిల్ కెరీర్ లోనే మొదటి కమర్షియల్ హిట్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం నిలిచింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్నిఅందించాడు.