తెలంగాణ రాష్ట్రంలోని 4 మండలాల్లో దళితబంధును పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. చింతకాని, తిరుమలగిరి, చారకొండ, నిజాంసాగర్ మండలాల్లో ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించింది.
చింతకాని మండలానికి రూ.100 కోట్లు, మిగతా 3 మండలాలకు రూ.50 కోట్ల చొప్పున ఇచ్చింది. ఇప్పటికే ఆయా మండలాల్లో దళిత బంధు ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్లు అవగాహన సదస్సులు నిర్వహించారు.