పిల్లల్ని కనడంపై అడిగిన ప్రశ్నకు రాంచరణ్ భార్య ఉపాసన సీరియస్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో ‘జూనియర్ రాంచరణ్/జూనియర్ ఉపాసన ఎప్పుడు వస్తారు’ అని యాంకర్ అడిగింది.
‘ఇది నా పర్సనల్. సోషల్ మీడియాలో ఎన్నో అడుగుతుంటారు. వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం నాకులేదు. ఎవరేమైనా అనుకోని.. నేను మాత్రం దీనికి సమాధానం చెప్పను. ఆ టైం వచ్చినప్పుడు గుడ్ న్యూస్ అందరికీ చెబుతా’ అని తెలిపారు. కాగా చెర్రీ, ఉపాసనకు 2012లో పెళ్లైంది.