పశ్చిమ బెంగాల్‌లో పలువురు కాషాయ పార్టీ నేతలు రాజీనామా చేసి పాలక టీఎంసీ గూటికి చేరుతున్న క్రమంలో తాజాగా బెంగాలీ నటి, పార్టీ నేత స్రవంతి ఛటర్జీ బీజేపీని వీడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి 2న ఆమె బీజేపీలో చేరారు.
బెంగాల్ అభివృద్ధిపై కాషాయ పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి, ప్రణాళికలు లేవని అందుకే తాను కాషాయ పార్టీని వీడుతున్నానని స్రవంతి ఛటర్జీ స్పష్టం చేశారు.మరోవైపు స్రవంతి ఛటర్జీ టీఎంసీలో చేరుతారనే ఊహాగానాలు సాగుతుండగా దీనిపై కాలమే సమాధానం చెబుతుందని నటి వ్యాఖ్యానించారు. కాగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె బెహలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి టీఎంసీ దవిగ్గజ నేత పార్ధ ఛటర్జీ చేతిలో ఓటమి చవిచూశారు.