దేశంలో విద్యాభివృద్ధికి బాటలు వేసిన దేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. ఆయన జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని రాజీవ్ మార్గ్‌లో ఉన్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ..విద్య అనేది రహస్యంగా దాచి పెట్టబడిన ధనం వంటిదన్నారు. విద్యయే సకల భోగాలను, కీర్తిని, సుఖాన్ని ప్రసాదిస్తుందని తెలిపారు. విద్యయే గురువు, విదేశాలలో మనకు బంధువు వంటిదని పేర్కొన్నారు.
విద్య అనేది విశిష్టమైన దైవం వంటిది. ఈ భూమ్మీద విద్యకు సాటి అయిన ధనమేదీ లేదని అన్నారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.