సూర్య హీరోగా నటించి తానే నిర్మాతగా జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని ఘన విజయం సాధించిన చిత్రం జైభీమ్.. ఈ చిత్రంలోని సినతల్లి పాత్రదారి అయిన రియల్ లైఫ్ సినతల్లికి ఇల్లు కట్టిస్తానని నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రకటించాడు.
చేయని నేరానికి చిత్రహింసలకు గురై మృతి చెందిన రాజకన్ను కుటుంబాన్ని ఆదుకుంటానన్నాడు. 28 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఆధారంగానే ‘జై భీమ్’ చిత్రం రూపొందింది. తాజాగా ఈ చిత్రాన్ని చూసి లారెన్స్.. రాజాకన్ను భార్య పార్వతమ్మకు మంచి ఇంటిని నిర్మించి ఇస్తానని ట్విట్టర్ వేదికగా తెలిపాడు.
https://twitter.com/offl_Lawrence/status/1457590553613193216/photo/1