Home / SLIDER / బండి సంజయ్ కు సీఎం కేసీఆర్ సవాల్

బండి సంజయ్ కు సీఎం కేసీఆర్ సవాల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ” తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. ఊరికే మాట్లాడటం కాదు. నువ్వు మనిషివే అయితే.. నిజాయితీ ఉంటే వెంటనే ఢిల్లీ నుంచి ఆర్డర్స్ తీసుకొనిరా.. వరి ధాన్యం కొంటామని కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకురా..అంటూ సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు.

ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతు సోదరులు ఎవరూ రాష్ట్ర బీజేపీ నాయకుల మాటలు నమ్మొద్దంటూ హితువు పలికారు.పంట పండించిన రైతులకు 10 రూపాయలు రావాలని మేము కొట్లాడుతున్నం. రైతును ముంచి రాజకీయం చేసి ఓట్లు రావాలని వాళ్లు కొట్లాడుతున్నరు.

ఈ కుటిల నీతిని రైతాంగం గమనించాలి. ఏడేళ్ల నుంచి రైతుల కోసం ఎక్కడలేని సదుపాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అది నిజం కాదా. ఇంత అద్భుతంగా సృష్టించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. అద్భుతమైన హైక్వాలిటీ పవర్ ఇస్తున్నం. చిల్లర రాజకీయాల కోసం మిమ్మల్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నరు. 10 రూపాయల పని చేయని వాళ్లను పట్టించుకోవద్దు. కరీంనగర్ నుంచి ఎంపీ అయ్యాడు. ఏమైనా చేసిందా? అసలు ఈయన ఢిల్లీలో ఏం మాట్లాడుతడో ఎవ్వరికీ తెలియదు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతడు. తెలంగాణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవని నోటీసులు ఇచ్చిన ఈ మనిషి.. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.. అంటూ సీఎం కేసీఆర్.. బండి సంజయ్‌పై మండిపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat