దేశంలో గడిచిన 24 గంటల్లో 11,451 కొత్త కొవిడ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 13,204 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అవగా.. మరో 266 మంది బాధితులు వైరస్ బారినపడి మృత్యువాతపడ్డారు.
యాక్టివ్ కేసులు 262 రోజుల కష్టానికి చేరుకున్నాయని.. ప్రస్తుతం దేశంలో 1,42,826 యాక్టివ్ కేసులున్నాయని పేర్కొన్నది.మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.42శాతం మాత్రమే ఉన్నాయని.. రికవరీ రేటు 98.24శాతానికి పెరిగిందని తెలిపింది.
తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,43,66,987కు పెరిగింది. ఇందులో 3,37,63,104 మంది బాధితులు కోలుకున్నారు. 4,61,057 మంది బాధితులు మహమ్మారి బారినపడి ప్రాణాలు వదిలారు.