టిఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది సందర్భంగా నవంబర్ 29 దీక్షా దివస్ న వరంగల్ లో నిర్వహించనున్న తెలంగాణ విజయ గర్జన సభకు ఎమ్మెల్సీ రైతుబంధు రాష్ట్ర నాయకులు పళ్ళ రాజేశ్వర్ రెడ్డి లతో కలిసి స్థల పరిశీలన చేసిన చేసిన ములుగు జడ్పీ చైర్మన్ మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ కుసుమ జగదీష్.వరంగల్ దేవన్నపేట లోని టిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన విజయ గర్జన సభ స్థలాన్ని పరిశీలించారు.
సభాస్థలి, పార్కింగ్ స్థలం, హాజరయ్యే కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు సరిపోయే విధంగా ఉంటుందా? అనే విషయాలను పరిశీలించారు అన్ని హంగులతో సభ విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు, అందుకు అన్ని విధాలుగా అనువైన స్థలం ఎంపిక చేశామన్నారు. ఇట్టి సభకు సీఎం, పార్టీ అధ్యక్షుడు కెసీఆర్ గారు హాజరై మాట్లాడతారని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించి 20 ఏండ్లు పూర్తయి 29న దీక్షా దివస్ సందర్భంగా సీఎం గారు ప్రజలనుద్దేశించి ఇన్నేండ్ల లో పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని నివేదిస్తారు అని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ అన్నారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పోరిక గోవింద్ నాయక్ కృష్ణారెడ్డి మైనార్టీ జిల్లా నాయకులు తాహెర్ పాషా ఉన్నారు