Home / MOVIES / విమాన ప్రమాదంలో సింగర్ మృతి

విమాన ప్రమాదంలో సింగర్ మృతి

ఊహించ‌ని ప్ర‌మాదంతో అభిమానులు షాక్ అవుతున్నారు. తాజాగా జరిగిన విమాన ప్రమాదంలో గ్రామీ అవార్డు విన్నర్ మారిలియా మెండోంకా మృతి చెందారు. ఆమె వ‌య‌స్సు 26 సంవ‌త్స‌రాలు. బ్రెజిల్ దేశానికి చెందిన గాయని మారిలియా మెండోంకా ఆమె మేనేజర్ మరియు సహాయకుడు మరికొందరితో కలిసి శుక్రవారం విమానంలో వెళుతుండ‌గా, ఆ విమానం కుప్పకూలిపోయింది.

ప్ర‌మాదంలో మారాలియాతో పాటు మేనేజర్‌ హెన్రిక్ రిబీరో, సహాయకుడు అబిసిలీ సిల్వీరా డయాస్ ఫిల్హోతో పాటు పైలట్ , కో-పైలట్ ప్రాణాలు కోల్పోయారు. విమానం కింద‌ప‌డ‌డానికి ముందు విద్యుత్ పంపిణీ లైన్‌ను ఢీకొట్టింద‌ని ప్ర‌భుత్వ రంగ విద్యుత్ సంస్థ సెమిగ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మారిలియా మెండోంకా కరాటింగా నగరంలో జరుగుతున్న మ్యూజిక్ కన్సర్ట్‌లో పాల్గొనాల్సి ఉంది. అందుకోసం తమ స్వస్థలమైన గోయానికా నుంచి కరాటింగాకు బయలుదేరారు. ఆ స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగింది.

ప్రమాదానికి కొన్ని గంటల ముందు విమానంనుంచే ఆమె ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్తున్న దృశ్యాలు, విమానం లోపల పండు, స్నాక్స్ తింటున్న క్లిప్‌ను అభిమానులతో పంచుకుంది. ఆ తర్వాత కాసేపటికే విమానం కూలిపోయింది కన్నుమూసింది మెండోంకా. 2019లో రిలీజ్‌ చేసిన ఆల్బమ్‌కు లాటిన్ గ్రామీ అవార్డును ఆమె గెలుచుకున్నారు. గత ఏడాది కోవిడ్-19 కారణంగా బ్రెజిల్‌లో లాక్‌డౌన్ విధించినప్పుడు.. మెండోంకా యూట్యూబ్‌లో ఓ వీడియో లైవ్ టెలికాస్ట్ చేశారు. ఆ వీడియో 3.3 మిలియన్ల వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో ప్రపంచ రికార్డు సాధించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat