Home / SLIDER / వృద్ధిలో తెలంగాణ రాకెట్‌ వేగం

వృద్ధిలో తెలంగాణ రాకెట్‌ వేగం

తెలంగాణ ఏర్పడే నాటికి దాని జీఎస్డీపీ రూ.4 లక్షల కోట్లు.. ఏడున్నరేండ్ల తర్వాత ఇప్పుడు అక్షరాలా రూ.9.80 లక్షల కోట్లు. తెలంగాణ ఆవిర్భవించినప్పుడు తలసరి ఆదాయం సుమారు రూ.95 వేలు ఉంటే.. ఇప్పుడు రూ.2.37 లక్షలు. పెద్ద.. చిన్న అన్న తేడా లేకుండా అన్ని రాష్ర్టాలను దాటుకొని.. స్వల్పకాలంలోనే ఎవరికీ అందనంత వేగంగా తారాజువ్వలా రాష్ట్ర ఆర్థిక వృద్ధి దూసుకుపోతున్నది. ఈ వృద్ధి రాజధానికి మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్రమంతటా సమగ్రంగా కనిపిస్తున్నది. గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన పబ్లిక్‌ అఫైర్స్‌ ఇండెక్స్‌ నివేదిక తెలంగాణ అభివృద్ధిని, సుపరిపాలనను కండ్లకు కట్టింది.

1 పబ్లిక్‌ అఫైర్స్‌ ఇండెక్స్‌లో తెలంగాణకు అగ్రస్థానం
తెలంగాణ ర్యాంకులు
వృద్ధిలో..అన్ని రంగాల్లో పనితీరు.
2 సుస్థిరాభివృద్ధిలో………… 5
సమానత్వంలో………….. 6
అన్ని రంగాల్లో పనితీరులో ఉత్తరప్రదేశ్‌ అధమస్థానంలో..
3 సమానత్వం, సుస్థిరాభివృద్ధిలో అట్టడుగున ఢిల్లీ
4 అన్ని రంగాల్లో పనితీరులో చివరి మూడు రాష్ర్టాల్లో ఒడిశా,బీహార్‌, యూపీ
వృద్ధి రేటులో మధ్యప్రదేశ్‌, యూపీ చివరి స్థానాల్లో
5 సుస్థిరాభివృద్ధిలోనూ యూపీ 18వ స్థానంలో

ప్రభుత్వ పనితీరుకు మరో నిదర్శనం

తెలంగాణ ఏర్పడిననాటి నుంచి రాష్ట్రం అభివృద్ధిలో ఏటికేడు బాగా మెరుగవుతున్నది. టీఎస్‌ ఐపాస్‌ వంటి సంస్కరణలు, రాయితీలతో పరిశ్రమల రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుండటం కలిసి వస్తున్నది. రాష్ట్రంలో నిపుణులైన మానవ వనరులు ఉండటం, ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడంతో అభివృద్ధిలో తెలంగాణ ముందు వరుసలో నిలుస్తున్నది. ఇప్పటికే అనేక నివేదికలు దీనిని రుజువు చేశాయి. తాజాగా పబ్లిక్‌ అఫైర్స్‌ సెంటర్‌ ఇచ్చిన ర్యాంకింగ్స్‌ తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు మరో నిదర్శనం.

–కే నరసింహమూర్తి, ఆర్థిక నిపుణుడు.

వృద్ధిరేటులో తెలంగాణ రాష్ట్రం తారాజువ్వలా దూసుకుపోతున్నది. అభివృద్ధితోపాటు సుస్థిరపాలనలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఎదిగిందని బెంగళూరుకు చెందిన పరిశోధన సంస్థ ‘పబ్లిక్‌ అఫైర్స్‌ సెంటర్‌’ ఈ ఏడాది విడుదలచేసిన ‘పబ్లిక్‌ అఫైర్స్‌ ఇండెక్స్‌-2021’(పీఏఐ) మరోసారి రుజువుచేసింది. వృద్ధిరేటులో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిన తెలంగాణ.. సుపరిపాలనకు సంబంధించిన అన్ని రంగాలలో పనితీరులో దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. సుస్థిరాభివృద్ధిలో ఐదోస్థానం, సమానత్వం అంశంలో ఆరోస్థానం దక్కించుకొన్నది. తెలంగాణ ఆవిర్భవించిన తొలిరోజు నుంచి పాటించిన ఆర్థిక క్రమశిక్షణ.. ఏ పరిస్థితిలోనూ ఆర్థిక వ్యవస్థను కునారిల్లకుండా చేసింది. యావత్‌ దేశాన్ని కొవిడ్‌ మహమ్మారి ముప్పిరిగొన్న సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా.. సమన్వయంతో పనిచేసి ఆర్థిక వ్యవస్థ బలహీనపడకుండా చర్యలు తీసుకొన్నది. అందువల్లనే దేశమంతా ఆశ్చర్యపోయేలా తెలంగాణలో సామాజిక, ఆర్థిక ప్రగతి లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరుతున్నాయి.

43 అంశాలు.. 14 లక్ష్యాలు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సుపరిపాలనను పీఏఐ కండ్లకు కట్టినట్టు చూపించింది. ఈ సంస్థ 43 అంశాలు, 14 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను పరిశోధన అంశాలుగా ఎంచుకున్నది. వీటన్నింటినీ 1) అభివృద్ధి (గ్రోత్‌), 2) సమానత్వం (ఈక్విటీ), 3) సుస్థిరాభివృద్ధి (సస్టెయినబిలిటీ) విభాగాలుగా విభజించింది. ఈ మూడు విభాగాల్లో దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును అధ్యయనం చేసింది. రాష్ర్టాల ఆర్థిక, భౌగోళిక పరిమాణాన్ని బట్టి పెద్ద రాష్ర్టాలు (18), చిన్న రాష్ర్టాలు (11), కేంద్ర పాలిత ప్రాంతాలుగా (6) వర్గీకరించింది. పీఏసీ బృందాల సమగ్ర అధ్యయన నివేదికలన్నీ క్రోడీకరించి.. ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. ఇందులో అభివృద్ధి విభాగంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సుస్థిరాభివృద్ధిలో 5, సమానత్వ సూచీలో ఆరో స్థానంలో నిలిచింది.

అభివృద్ధిలో అగ్రతాంబూలం.
మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, బడ్జెట్‌ కేటాయింపుల ఆధారంగా రాష్ర్టాల వృద్ధి సూచీని నిర్ధారించారు. ఒక రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధించాలంటే ఈ మూడు అంశాలు కీలకమని పీఏసీ పేర్కొన్నది. ఉత్తమ విద్యాసదుపాయాలు ఉన్నప్పుడే నైపుణ్యం గల మానవ వనరులు తయారవుతాయని, మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రాధాన్య రంగాలను ఎంచుకొని నిధులు కేటాయించి, వాటిని సక్రమంగా వినియోగించినప్పుడే ఆ రాష్ర్టాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పింది. ఈ అంశాల్లో తెలంగాణ దేశంలో మొదటిస్థానంలో నిలిచినట్టు సంస్థ తెలిపింది. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ పలు సందర్భాల్లో ‘తెలంగాణలో నైపుణ్యమున్న మానవ వనరులు, అద్భుతమైన మౌలిక సదుపాయాలున్నాయి’ అని చెప్తుంటారు. ఇవే తెలంగాణను పెట్టుబడుల ఆకర్షక కేంద్రంగా మార్చాయి. కేటీఆర్‌ వ్యాఖ్యలను ‘పీఏఐ-2021’ మళ్లీ రుజువు చేసింది.

పాలనలో టాప్‌-3.
అభివృద్ధి, సమానత్వం, సుస్థిరాభివృద్ధి విభాగాల్లో రాష్ర్టాలు సాధించిన ర్యాంకులను క్రోడీకరించి ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌ కేటాయించారు. ఈ ర్యాంకులు ఆయా రాష్ర్టాల పాలనా సమర్థతకు (గవర్నెన్స్‌) నిదర్శనంగా తెలిపింది. ఈ జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. గతేడాది గవర్నెన్స్‌ ర్యాంకింగ్‌లో తెలంగాణ ఆరో స్థానంలో నిలువగా ఏడాది కాలంలోనే మూడు స్థానాలు ఎగబాకింది.

ఏడాదిలోనే అగ్రభాగానికి..
పీఏసీ గతేడాది విడుదలచేసిన ‘పీఏఐ-2020’లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నది. ఏడాదిలోనే అగ్రభాగానికి చేరడం విశేషం. ఈ ఏడాది కేరళ, కర్ణాటక, తమిళనాడును వెనక్కి నెట్టేసింది. గతేడాది ఏపీ 5వ స్థానంలో ఉండగా, ఈసారి 11వ స్థానానికి పడిపోయింది.

వృద్ధిరేటు జాబితాలో కేరళ, జార్ఖండ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ అట్టడుగున నిలిచాయి.
అభివృద్ధి సూచీ-2021లో టాప్‌-5 రాష్ర్టాలు వృద్ధిరేటు జాబితాలో కేరళ, జార్ఖండ్‌ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ అట్టడుగున నిలిచాయి.
అభివృద్ధి సూచీ-2021లో టాప్‌-5 రాష్ర్టాలు
(అంకెలు పాయింట్లు)
తెలంగాణ 1.380
కేరళ 1.348
జార్ఖండ్‌ 0.930
గుజరాత్‌ 0.805
పంజాబ్‌ 0.698

పెరిగిన సమానత్వం
రాష్ట్రంలో సమానత్వం పెంపొందించేలా, అన్ని వర్గాల ప్రజలను, అన్ని వయస్సుల వారిని ఆదుకొనేలా ప్రభుత్వాలు పథకాలు రూపొందించి అమలుచేసే విధానం ఆధారంగా పీఏసీ ‘ఈక్విటీ’ ర్యాంకింగ్స్‌ ఇచ్చింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు, సంస్కరణలతో రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల ప్రజలు తాము ఇతరులకు ఏమాత్రం తీసిపోమనే ధైర్యం కల్పించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఈ జాబితాలో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది.

విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాల ఫలితం.
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ఏడేండ్ల కిందట ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు రచించి, అమలు చేస్తున్నారు. పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించేందుకు టీఎస్‌ఐపాస్‌ వంటి విప్లవాత్మక సంస్కరణలను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో విస్తృతంగా మౌలిక సదుపాయాలు కల్పించారు. ఫలితంగా రాష్ర్టానికి ఏడేండ్లలో 11 వేలకుపైగా పరిశ్రమలు తరలిరాగా, దాదాపు రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సుమారు 13 లక్షల మందికి ఉపాధి లభించింది. ఐటీ, ఫార్మా రంగాల్లో దేశంలోనే టాప్‌ స్థానానికి చేరుకున్నది. మరోవైపు స్థానిక యువతకు ఉపాధి కల్పన, రాష్ట్రంలో నిపుణులైన మానవ వనరుల తయారీకి తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) వంటి సంస్థల ద్వారా లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ కృషిని గుర్తించి ఇప్పటికే అనేకమంది ఆర్థికవేత్తలు, నిపుణులు, వివిధ నివేదికలు ప్రశంసించాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat