టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టాక తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుంటుందని అంతా భావిస్తూ వస్తున్నారు. అయితే దుబ్బాక ఎన్నికల తర్వాత రేవంత్ ఎన్నో ఆరోపణలను సొంత పార్టీ నేతల నుంచే ఎదుర్కొంటున్నారు.
ఈ క్రమంలోనే ఓ మాజీ నేత పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌కు షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్సీ ఒకరు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు.
పార్టీ కమిటీలను ఇష్టారాజ్యంగా మార్చడంపై మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లాలోని తన వర్గం నేతలతో భేటికానున్నారు. భవిష్యత్ కార్యాచరణను ప్రేమ్ సాగర్‌రావు ప్రకటించనున్నారు.