జఫర్ఘడ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందిన గంగాధర స్వాతి హైదరాబాద్ లో (GNM) నర్సింగ్ చదువుతోంది. తల్లితండ్రులు లేని నిరుపేద కుటుంబానికి చెందిన స్వాతి కళాశాల ఫిజు చెల్లించేందుకు ఆర్థికంగా స్తోమతలేక ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ కళాశాల ఫీజు నిమిత్తం అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా రూ.30వేల రూపాయల చెక్కును విద్యార్థినికి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, కష్టపడి చదివి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.
