ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్‌ను పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుధాంశు పాండే శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకొన్నదని చెప్పారు. ఉచిత రేషన్ విధానం ఈ నెల 30వరకే అమల్లో ఉంటుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో పేదలకు గరీబ్ కల్యాణ్ యోజన కింద గతేడాది మార్చి నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ కార్డులో పేర్లు ఉన్నవారికి నెలవారీ కోటాకు అదనంగా ఒక్కొక్కరికి ఉచితంగా 5 కిలోల బియ్యం/గోధుమలు, కిలో పప్పులు ఇస్తున్నది.