యాంకర్ లాస్య సంచలనాలకు తెరలేపారు. తాజాగా ఆమె ‘దీపావళి’ స్పెషల్‌గా ఓ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ వీడియోలో లాస్యతో పాటు ఆ మధ్య పరువు హత్య నేపథ్యంలో భర్త ప్రణయ్‌ను కోల్పోయిన అమృత ప్రణయ్ కూడా జత కలవడంతో.. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వీరితో పాటు గలాటా గీతూ, అలేఖ్య వంటివారు కూడా ఈ సాంగ్‌లో డ్యాన్స్ చేశారు. చక్కని సాహిత్యంతో ‘దీపావళి’ స్పెషల్‌గా వచ్చిన ఈ వీడియో సాంగ్ మంచి స్పందనను రాబట్టుకుంటోంది.
ఈ వీడియోకి స్పెషల్ అమృత ప్రణయే కావడం విశేషం. ఎందుకంటే ఆమెని ఇలా ఎవరూ ఊహించి ఉండరు. ప్రణయ్ హత్య తర్వాత పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన అమృత.. ఇప్పుడు కాస్త తేరుకుని ఇలా దర్శనమివ్వడం నిజంగా గొప్ప విషయమే. ఈ విషయంలో లాస్య మంజునాధ్‌ను ఖచ్చితంగా అభినందించాల్సిందే. సాంగ్‌ని కూడా చాలా చక్కగా పిక్చరైజ్ చేశారు.
ఇందులో లాస్య డ్యాన్స్ మూమెంట్స్ ఆకట్టుకుంటుంటే.. అమృత వంటి వారి అప్పీయరెన్స్ ఈ వీడియోపై ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. వీడియో సాంగే కాకుండా.. ఈ సాంగ్‌కు సంబంధించిన మేకింగ్ వీడియోని కూడా విడుదల చేశారు. ఇందులో అమృత తన అనుభవాలను తెలియజేస్తూ.. ఈ సాంగ్ మేకింగ్ ఎలా జరిగిందో తెలియజేసింది. ఓవరాల్‌గా.. అమృత అప్పీయరెన్స్‌తో ఇప్పుడీ వీడియో టాక్ ఆఫ్ ద సోషల్ మీడియాగా మారింది.