టి20 ప్రపంచకప్‌లో తన చివరి మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. అబుధాబిలో జరిగిన మ్యాచ్లో విండీస్ ని 20 పరుగుల తేడాతో శ్రీలంక ఓడించింది. మొదట టాస్ ఓడి శ్రీలంక బ్యాటింగ్‌కు దిగింది. 20 ఓవర్లలో మూడు కోల్సోయి 189 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ ముందు ఉంచింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్ అసలంక (68), నిస్సాంక(51), పెరీరా(29), శనక(25) టీమ్‌కు ఒక గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగారు. వెస్టిండీస్ బౌలర్లలో రస్సెల్ రెండు వికెట్లు, బ్రావో ఒక వికెట్ సాధించాడు.
వెస్టిండీస్ టీమ్ 190 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఆ తరువాత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి వెస్టిండీస్ 169 పరుగులు చేసి కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో బినూర ఫెర్నాండో, చమిక కరుణరత్నే, వనిందు హసరంగా చెరో రెండు వికెట్లు సాధించారు.
శ్రీలంక జట్టుకు ఇది చివరి సూపర్ 12 దశ మ్యాచ్. కానీ ఈ మొదటి దశలో శ్రీలంకకు కేవలం రెండు విజయాలే దక్కాయి. దీంతో శ్రీలంక ఇక ఇంటికి బయలు దేర్సాలిన పరిస్థితి ఏర్పడింది. వెస్టిండీస్ కూడా ఈ ఓటమితో టి20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది.