ఈ ఏడాది క్రాక్ సినిమా సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని . హీరో నందమూరి బాలకృష్ణ , గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మాస్ ఎంటర్ టైనర్ రాబోతున్న విషయం తెలిసిందే.
ఈ క్రేజీ కాంబో ప్రాజెక్టుపై ఆసక్తికర వార్తను మేకర్స్ అందరితో పంచుకున్నారు. కోలీవుడ్ భామ శృతిహాసన్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశారు.శృతిహాసన్‌కు టీంలోకి స్వాగతం అంటూ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ స్టిల్‌ను విడుదల చేశారు.
తాజాగా కొత్త విడుదల తేదీ ఒకటి ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. శృతిహాసన్ అందరూ అనుకున్నట్టుగానే శృతిహాసన్‌ను గోపీచంద్ మలినేని మరోసారి తన హీరోయిన్గా ఎంపిక చేసుకున్నాడు. గోపీచంద్-శృతిహాసన్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు బాక్సాపీస్‌ను షేక్ చేశాయి. ఈ సెంటిమెంట్ బాలకృష్ణ సినిమాకు కూడా పనిచేస్తుందని ధీమాగా ఉన్నాడీ డైరెక్టర్.