వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ముగిశాక క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలగనున్నట్లు ప్రకటించాడు.
గతరాత్రి శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ ఓటమి తర్వాత ఆయన ఈ ప్రకటన చేశాడు.18 ఏళ్లుగా వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించానని, ఈ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నానని ఆయన అన్నాడు.
వెస్టిండీస్ జట్టులో ఆడటం ఎల్లప్పుడూ అదృష్టంగానే భావిస్తున్నానని డ్వేన్ బ్రావో అన్నాడు. గురువారం శ్రీలంకతో మ్యాచ్ అనంతరం ఫేస్బుక్ లైవ్‌లో బ్రావో ఈ వ్యాఖ్యలు చేశాడు.