అందాల రాక్షసిగా ఇండియన్ స్ర్కీన్ ను ఒక ఊపు ఊపిన బాలీవుడ్ బ్యూటీ టబు. అయితే ఆమె ఇప్పటి వరకూ పెళ్ళిమాటే తలపెట్టలేదు. వయసు మీద పడిపోతున్నా. ఇంకా పెళ్ళిపీటలెక్కకపోవడానికి కారణం ఏంటో తెలుసా? .
ఇంకెవరు? బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ణే అంటున్నారు ఆమె. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్ళిగురించి పలు ఆసక్తికరమైన విషయాల్ని రివీల్ చేసి అందరికీ షాకిచ్చారు ఆమె.
అజయ్ దేవ్‌గణ్ తనకి చిన్నప్పటి నుంచి అంటే 14, 15 వయసప్పుడే తెలుసని, అజయ్ తన సోదరుడి ఫ్రెండేనని, తామంతా జుహూలో కలిసి పెరిగామని పేర్కొంది. అప్పట్లో అజయ్ తనవెంట పడేవాడని రివీల్ చేసింది.తనతో ఎవరైనా అబ్బాయిలు మాట్లడడానికి ట్రై చేస్తే అజయ్ అసలు సహించేవాడు కాదని, వాళ్ళని కొట్టడానికి కూడా వెనుకాడేవాడు కాదని తెలిపింది. అంతేకాదు తనని ఒక కంటకనిపెడుతూ.. ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నానని కనిపెట్టి మరీ వెనకాలే వచ్చేవాడని చెప్పుకొచ్చింది టబు. అతడి వల్లనే తాను ఇప్పటి వరకూ పెళ్ళి చేసుకోకుండా సింగిల్ గా ఉన్నానని వెల్లడించింది టబు. దీనికి బాధ్యుడైనందుకు అజయ్ పశ్చాత్తాప్పడాలని పేర్కొంది ఆమె.